Saturday, March 23, 2013

శ్రీరాముడి శరణాగత వాత్సల్యం

శ్రీరాముడి శరణాగత వాత్సల్యం
--------------------------------------

రాముడితో యుద్ధం వద్దని, హితవు పలికిన విభీషణుడి హిత వచనాలను వినకపోగా, నిండు సభలో అతడిని ఘోరంగా అవమానిస్తాడు, రావణుడు. విభీషణుడు ఆకాశ మార్గంలో నిలబడి, శ్రీరాముడిని శరణు కోరతాడు. 

రాముడి క్షేమాన్ని కోరి, శత్రువయిన విభీషణుడికి ఆశ్రయం ఇవ్వడం అంట మంచిది కాదని, సలహా ఇస్తారు వానర వీరులు. హనుమంతుడు మాత్రం విభీషణుడు ఉత్తముడని, యదార్ధ శరణా గతుడని సలహా ఇస్తాడు. సుగ్రీవుడు ఇందుకు వప్పుకోక, తర్కంతో వాదించి, అనేక ఆపదలు కలుగవచ్చని సూచిస్తాడు. అప్పుడు రాముడు ఇలా అంటాడు.

" పిశాచాన్ దానవాన్ యక్షాన్ పృధివ్యాం చైవ రాక్షసాన్ 
  అంగుల్యగ్రేణ తాన్ హన్యామిచ్చాన్ హరిగణేశ్వర || "  ( వా. రా . 6/18/23, 27, 33)

" వానరాదీశ ! నేను కోరుకుంటే - యావత్భూమండలం లోని పిశాచ, దానవ, యక్ష, రాక్షసులను నా కాలి బొటనవేలి కొనతో, అంతం చెయ్యగలను. కనుక భయపడవలసిన పని లేదు. శత్రువయినా, దీనంగా శరణు కోరితే, అతనిని అంతం చెయ్యరాదు. ఆటను విభీషణుడు కాదు, రావణుడు అయినా సరే, నన్ను శరణు కోరిన వారిని, సర్వ ప్రాణుల నుండీ నిర్భయంగా ఉంచుతానన్నది , నా వ్రతం. కనుక మీరు నిర్భయంగా విభీషణుడిని నా వద్దకు తీసుకు రండి.  "


No comments:

Post a Comment