Monday, October 14, 2013

అనులోమ విలోమ కావ్యాలు

కోండ్రు వాసుదేవ రావు గారు అందించిన సమాచారం 

రామకృష్ణ విలోమ కావ్యం 

14వ శతాబ్దపు శ్రీ దైవజ్ఞ సూర్య పండితులు వారు రచించిన ఈ "రామకృష్ణ విలోమ కావ్యం" మొత్తం 36 శ్లోకాలుగా ఉంది. మొదటి నుంచి చివరికి చదివితే రామాయణం, చివరి నుంచి మొదటికి చదివితే భారతం తెలియ చేస్తుంది. ఆ కావ్యంలోని 36 శ్లోకాలని 3 భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను. స్థూలంగా చూసినా, సూక్ష్మంగా పరీక్షించినా సంస్కృతం ప్రపంచ భాషలన్నింటి లోకీ ఉన్నతమైనది. భాషా వేత్తలంతా ముక్త కంఠంతో పలకగలిగే సత్యమిది. వీటి తాత్పర్యాన్ని తెలుగులో ఇవ్వవలసినదిగా ఈ 'అచ్చం తెలుగు' లోని పండితులకు ప్రార్ధనా పూర్వక వినతి. 

తం భూసుతాం ముక్తి ముదార హాసం
వందే యతో భవ్య భవం దయాశ్రీః
శ్రీయాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముంతా సుభూతం //1//

చిరం విరంచి: న చిరం విరంచి:
సాకారతా సత్య సతారకా సా 
సాకారతా సత్య సతారకా సా 
చిరం విరంచి: న చిరం విరంచి://2//

తామ సీత్యసతి సత్యసీమతా 
మాయయాక్ష మసమక్ష యాయమా 
మాయయాక్ష మసమక్ష యాయామా 
తామసీత్యసతి సత్య సీమతా //3//

కా తపఘ్నీ తారకా ద్వా విపాపా 
త్రేధావిద్యా నోష్ణ కృత్యం నివాసే 
సేవా నిత్యం కృష్ణ నోద్యా విధాత్రే 
పాపా విద్యాకార తాఘ్నీ పతాకా //4//

శ్రీరామతో మధ్యమతో దియేన 
ధీరో నిశం వశ్యవతీ వరాద్వా 
ద్వారావతీ వశ్య వశం నిరొధీ 
నయేదితో మధ్య మతో మరా శ్రీ://5//

కౌశికే త్రితపసి క్షరవ్రతీ 
యో దదా ద్వితనయ స్వమాతురం 
రంతు మాస్వయన తద్విదాదయో 
తీవ్ర రక్షసి పతత్రి కేశికౌ//6//

లంబాధరోరు త్రయలంబనాసే 
త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా 
జ్ఞాతాగమా రక్షహి యాహియాత్వం 
సేనా బలం యాత్ర రురోధ బాలం //7//

లంకాయనా నిత్యగమా ధవాశా 
సాకం తయానున్నయ మానుకారా 
రాకానుమా యన్నను యాతకంసా 
శావా ధమాగత్య నినాయకాలం //8//

గాధిజాధ్వర వైరాయే 
తే తీతా రక్షసా మాతా:
తామ సాక్షరతా తీతే 
యేరా వైర ధ్వజాధిగా: //9//

తావదేవ దయాదేవే 
యాగే యావ దవాసనా 
నాసవాదవ యాగే యా
వేదే యాదవ దేవతా //10//

సభాస్వయే భగ్నమనేన చాపం 
కీనా శతాన ద్ధరుషా శిలా శైః 
శైలా శిషా రుద్ధన తాశనాకీ 
పంచాననే మగ్న భయే స్వభాస //11//

నవేద యామక్షర భామసీతాం 
కాతారకా విష్ణు జితే వివాదే 
దేవావితే జిష్ణు వికారతాకా 
తాం సీమభార క్షమయా దవేన //12//

తీవ్ర గోర న్వయత్రార్యో 
వైదెహీ మనసో మత:
తమ సోన మహీ దేవై
ర్యోత్రా యన్వర గోవ్రతీ //13//

వేదయా పద్మసదనం 
సాధారావ తతారమా 
మారతా తవ రాధాసా 
నంద సద్మప యాదవే //14//

శైవతో హననే రోధీ 
యో దేవేషు నృపోత్సవ:
వత్స పోనృషు వేదే యో 
ధీరో నేన హతో వశై://15//

నగోపగో సి క్షరమే పినాకే 
నా యోజనే ధర్మ ధనేన దానం 
నందాననే ధర్మ ధనే జయోనా 
కేనాపి మే రక్షసి గోపగోన://16//

తతాన దామ ప్రమదా పదాయ 
నేమేరు చామ స్వన సున్దరాక్షీ 
క్షీరా దసుం న స్వమచారు మేనే 
యదాప దామ ప్రమదా నతాత: //17//

తామితో మత్త సూత్రామా 
శాపా దేష విగానతాం 
తాం నగా విషదే పాశా 
మాత్రా సూత్త మతో మితా //18//

నాసావద్యా పాత్ర పాజ్ఞా వినొదీ 
ధీరో నుత్యా సస్మితో ద్యావి గీత్యా 
త్యాగీ విద్యా తోస్మి సత్యాను రోధీ 
దీనోవి జ్ఞాపాత్ర పద్మావసానా //19//

సంభావితం భిక్షుర గాదగారం 
యాతాధిరాప స్వనఘాజ వంశ:
శవం జఘాన స్వపరాది తాయా 
రంగాదగార క్షుభితం విభాసం //20//

తయాతి తార స్వనయాగతం మా 
లోకాప వాద ద్వితయం పినాకే 
కేనాపి యం తద్విదవాప కాలో 
మాతంగ యాన స్వరతాతి యాత://21//

శవే విదా చిత్రకురంగ మాలా 
పంచావటీ నర్మన రోచతేవా 
వాతేచరో నర్మ నటీవ చాపం 
లామాగరం కుత్ర చిదా వివేశ //22//

నేహ వా క్షిపసి పక్షికంధరా 
మాలినీ స్వమత మత్త దూయతే 
తే యదూత్తమ తమ స్వనీలిమా 
రాధకం క్షిపసి పక్షివాహనే //23//

వనాంత యాన స్వణు వేదనాసు 
యోషామృతే రణ్య గతా విరోధీ 
ధీరోవితా గణ్యరతే మృషాయో 
సునాద వేణు స్వనయాతనాం వ://24//

రామకృష్ణ విలోమ కావ్యం - 3

కిం ను తోయరసా పంపా 
న సేవా నియతేన వై 
వైనతేయ నివాసేన 
పాపం సారయతో ను కిం //25//

స నతాపతపహా తేన 
స్వం శేనా విహితాగసం 
సంగతాహి వినాశే స్వం 
నేతేహాప తటాన స://26//

కపితాల విభాగేన 
యోషాదో నునయేన స:
స నయే నను దోషాయో 
నగే భావిలతాపిక://27//

తే సభా ప్రకపివర్ణమాలికా 
నాల్పక ప్రసర మభ్ర కల్పితా 
తాల్పిక భ్రమర సప్రకల్పనా 
కాలిమా ర్ణవ పిక ప్రభాసతే //28//

రావణే క్షిపతనత్రపానతే 
నాల్పకభ్రమణ మక్రమాతురం 
రంతు మాక్రమణ మభ్రకల్పనా 
తేన పాత్రన తపక్షిణే వరా //29//

దైవే యోగే సేవాదానం 
శంకా నాయే లంకా యానే 
నేయాకాలం యేనాకాశం 
నందావాసే గేయోవేదై: //30//

శంకానజ్ఞాను త్వనుజ్ఞా వకాశం 
యానే నద్యా ముగ్రముద్యాన నేయా 
యానే నద్యా ముగ్రముద్యాన నేయా 
శంకానజ్ఞాను త్వనుజ్ఞా వకాశం //31//

వా దిదేశ ద్విసీతాయం 
యం పాధో యనసేతవే 
వేత సేన యధోపాయం 
యం తాసీ ద్విశ దేదివా //32//

వాయం జో నుమతో నేమే 
సంగ్రామే రవితో హ్ని వ:
వహ్నితో రమే గ్రాసం 
మేనే తో మనుజో యంవా //33//

క్షతాయ మా యత్ర రఘోరితాయు 
రంకానుగానన్య వయో యనాని 
నినాయ యోవన్య నగానుకారం 
యుతారి ఘోరత్రయ మాయతాక్ష: //34//

తారకే రిపురాప శ్రీ:
రుచా దాస సుతాన్విత:
తనవి తాసు సదా చారు 
శ్రీ పరా పురి కే రతా //35//

లంకా రంకాగరాధ్యాసం 
యానే మేయా కారా వ్యాసే 
సేవ్యా రాకా యామే నేయా 
సంధ్యా రాగా కారం కాలం //36//

॥ ఇతి శ్రీ దైవజ్ఞ పండిత సూర్యకవి విరచితం విలోమాక్షర రామకృష్ణ కావ్యం సమాప్తం ॥


                         

దేవరకొండ సుబ్రహ్మణ్యం గారు అందించిన సమాచారం 

అనులోమ విలోమ కావ్యం
శ్రీ రాఘవ యాదవ్యం అనే కావ్యం లో రామ కథ, కృష్ణ కథ ఒకేసారి వస్తాయి. దీనిని అనులోమ విలోమ కావ్యం అంటారు.

అందులోంచి ఒక పద్యం .... 

వందేహం దేవం తం శ్రీతం
రంతారం కాలం భాసాయః
రామో రామాధీరాప్యాగో
లీలామారాయోధ్య వాసే
దీని అర్థం : సీత కొరకు పరితపించుచూ సహ్యాద్రి పర్వతములు దాటి, రావణుని చంపి, సీతతో అయోధ్యలో చాలాకాలము నివసించెనో, ఆ రామునికి నా నమస్సులు . 

ఇప్పుడు ఇదే పద్యాన్ని తిరగ వేసి రాస్తే: 

సేవాధ్యేయో రామాలాలీ
గోప్యారాధీ మారామోరాః
యసాభాలంకారం తారం
తం శ్రీతం వందేహం దేవం
దీని అర్ధం : వక్షస్థలి లక్ష్మీ వాసమై, యజ్ఞ పూజాదులతో స్మరించ యుక్తుడో, రుక్మిణి మున్నగు భార్యలతో సరసమాడునో, గోపికలచే వందించ బడునో, నగలతో విరాజితుడై ఉండునో, అట్టి శ్రీ కృష్ణునకి నా నమస్సులు.

రామకృష్ణారావు గారి బ్లాగ్ నుంచీ సేకరణ 

అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరనార్యుడు రచించిన ఒక పద్యం.... పద్యంలో ప్రారంభం నుండి చివరి దాకా చదివితే తెలుగు పద్యమై తెలుగు పదాల పొందిక గలిగి తెలుగు లో అర్థ స్ఫూర్తి కలిగిస్తుంది.
మరి అదే పద్యాన్ని చివరి పాదంలో చివరి అక్షరం నుండి మొదటి పాదంలో మొదటి అక్షరం దాకా { వెనుకనుండి ముందుకు } చదివితే అత్యంత ఆశ్చర్య జనకంగా సంస్కృతపద భూయిష్ఠమై చక్కని భావ స్ఫూర్తిని కలిగిస్తుంది. వింతగా వుంది కదూ? ఐతే ఆ పద్యమేమిటో చూద్దామా?
కందము:-
తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తెజా
దేవర గౌరవ మహిమన
మావలసిన కవిత మరిగి మాకునధీశా.
ముందుగా తెలుగులో చూద్దాం.
ప్రతిపదార్థము:-
అతి విభావిసు తేజా = మిక్కిలి ప్రకాశించు పరాక్రమము కల
అధీశా = ఓ మహారాజా!
దేవర గౌరవ మహిమన = మీ ఘనత యొక్క మహిమ చేతనే
మా వలసిన కవిత = మా ప్రియమైన కవిత్వము
తాన్ = అది
వినువారికి సరవిగన్ = వినెడి వారికి యుక్తముగా
భావనతోన్ = భావించుటతో { ఆలకించు వారు సముచితముగా నున్నదని తలచినట్లు }
మాకు మరిగి = మాకు అలవడి { మరుగు రూపాంతరము మరిగి }
ఆనున్ = కనిపించును
భావము:-
మిక్కిలి ప్రకాశించు పరాక్రమము గల ఓ మహారాజా! మీ ఘనత యొక్క మహిమ చేతనే మా ప్రియమైన కవిత్వము ఆలకించువారు అది యుక్తముగా భావించుటతో మాకు అలవడి వ్యక్తమగుచున్నది.
{ఓరాజా! మేమాశ్రయించిన మీ మహత్వము వలననే శ్రోతల కానందకరమైన కవిత్వము మా కబ్బినది.అని భావము.}
అదే పద్యాన్ని తలక్రిందుగా వ్రాసి చూస్తే సంస్కృతం. చూద్దామా?
సంస్కృతం లో పద చ్ఛేదము:-
శాధి - ఇన - కుం - ఆగిరి - మత - వికనసి - లవమాన - మహిమవరగౌరవదే - జాతే - సువిభౌ - ఇతి - నను - నా - అతః - నవభాః - గవి - రసకిరి - వా - అనువితా.
అన్వయ క్రమము:-
ఇన - ఆగిరి - కుం - శాధి - మత - వికనసి - లవమాన - నను - మహిమవరగౌరవదే - సువిభౌ - ఇతి - జాతే - నా - అతః - నవభాః - రసకిరి - గవి - అనువితా వా.
ప్రతిపదార్థము:-
ఇన =ఓ రాజా!
ఆగిరి = పర్వతములున్నంత కాలము
కుం = భూమిని
శాధి = శాసింపుము
మత = సర్వ సమ్మతుడా!
వికనసి = మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు.
లవమాన = లవుని యొక్క మానము వంటి మానము కలిగిన
నను = ఓ భూవరా!
మహిమవరగౌరవదే = గొప్పతనముచే శ్రేష్ఠమైన గౌరవమునిచ్చునట్టి
సువిభౌ = నీ వంటి మంచి రాజు
ఇతి = ఈ విధముగా
జాతే = కలిగి యుండగా
నా = పండితుడైన, మనుష్యుడు
అతః = ఇట్టి గౌరవము వల్ల
నవభాః = క్రొత్త వికాసముగలవాడై
రసకిరి = రసము చిమ్మునట్టి
గవి = భాషయందు
అనువితా వా = స్తుతింపనివాడగునా! { తప్పక నుతించువాడగునని యర్థము. }
భావము:-
-ఓ రాజా పర్వతములున్నంత కాలము భూమిని శాసింపుము. సర్వ సమ్మతుడా! మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లు చున్నావు. లవుని యొక్క మానము వంటి మానము కలిగిన ఓ భూ వరా! గొప్పతనముచే శ్రేష్ఠమైనట్టి నీ వంటి మంచి రాజు యీ విధముగా కలిగి యుండగా పండితుడైన మనుష్యుడు ఇట్టి గౌరవము వల్ల క్రొత్త వికాసము కలవాడై రసము చిమ్మునట్టి భాష యందు స్తుతింపనివాడగునా. స్తుతింపబడును.
చూచారు కదా! ఎంత అద్భుతంగా వుందో.
మన సాహిత్యంలో వున్న చిత్ర విచిత్ర కవిత్వాలను గూర్చి తెలుసుకోవాలంటే బహుశా మన జీవితం చాలదేమో. 
(అంతర్జాల సేకరణ ...రామకృష్ణారావు గారి బ్లాగ్ నుంచీ...)


No comments:

Post a Comment