Sunday, April 14, 2013

మన వివాహ వ్యవస్థ

రచన : శ్రీ వి.వి.  ఎస్ . శర్మ గారు, బెంగళూరు

మన వివాహ వ్యవస్థ - 1
మనం మహాశివరాత్రి నాడు పార్వతీ-పరమేశ్వరుల కల్యాణము, శ్రీరామనవమి నాడు సీతారామకల్యాణము, తిరుపతిలో నిత్యమూ శ్రీవేఙ్కటేశ్వర స్వామి కల్యాణం చేసుకొని, లేదా చూసి సంతోషిస్తాం. ఇది పిల్లలు ఆడుకునే బొమ్మల పెళ్ళా? ఈ ఆరాధనకు మన వివాహ వ్యవస్థకు సంబంధం ఉన్నదా? దీని వలన వచ్చే ఫలం ఏమిటి?
భారతీయ సంస్కృతిలో వివాహవ్యవస్థ అతిముఖ్యమైనది. సమాజంలో అతిచిన్నభాగం కుటుంబం. వ్యక్తి కాదు. కుటుంబం అంటే దంపతులు. తరువాత వారి సంతానం. వ్యక్తులను దంపతులుగా మార్చి ఒక నూతనకుటుంబం ఏర్పాటు చేసే ప్రక్రియ వివాహం. మన సాంప్రదాయంలో గృహస్థాశ్రమం ఒక పెద్ద అడుగు. ఎన్నో బాధ్యతలతో కూడినది. హిందువులుగా మనం అనేకవిషయాలను స్వీకరిస్తాం. దేవతలు, వారి ఆరాధన, పునర్జన్మ, కర్మ సిద్దాంతం. పరమేశ్వరుడు. అతడి శక్తి. సృష్టి. కాలం. అందులో అతిచిన్న కథ మన జీవితం. మన జనన మరణాల మధ్యకాలం. శక్తిలేకుండా శివుడులేడు. ఒకటె రెండు అయినది. వారిద్దరి కలయికను కూడా మన వివాహంవలె దర్శిస్తున్నాం. ఈ మన్వంతరం ప్రారంభంలో భూమిమీదనే జరిగినదని విశ్వసిస్తున్నాం. కల్యాణం అంటే పెళ్ళి మాత్రమే కాదు. శుభం, మంగళం. కల్యాణ ప్రదం. ఇది చేస్తే, చూస్తే మనకు పుణ్యం, మనకు మనపిల్లల జీవితాలకు కల్యాణప్రదమని నమ్ముతున్నాం. మనం సంప్రదాయ వివాహం విషయం మాట్లాడుతున్నాం. మన అమ్మాయికి యుక్తవయస్సు వచ్చినది. వరాన్వేషణ ప్రారంభిస్తాము. యోగ్యుడైన వరునికై అన్వేషిస్తాము. మన శ్రేయోభిలాషుల సహకారం స్వీకరిస్తాము. అన్ని విషయాలలో మనకి నచ్చితే, వారికుటుంబంతో సంప్రదించి వరునికి కన్యాదానం చేస్తాము. ఇది పూర్తిగా కన్యాదాత తనకు యోగ్యుడనిపించిన వరునకు మన అమ్మాయి నిచ్చే కార్యక్రమం. వరుడు దాన గ్రహీత. నిజానికి అల్లుడు అత్తవారికి కృతజ్ఞుడై ఉండవలసిన పరిస్థితి.
ఈ విషయం అర్థమైతే, ఆచేసిన కార్యక్రమాన్ని అర్థంచేసుకునే శక్తిఉంటే సమస్యలేదు. వీటిమీద శ్రద్ధ, విశ్వాసం ఉంటే ఈ మంత్రాలకు, జరిగిన కార్యక్రమానికి విలువ ఉంటుంది. అప్పుడు అది రక్షిస్తుంది. రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు సాక్షుల ఎదుట పెళ్ళిచేసుకోవచ్చును. అదీ న్యాయ బద్ధమే. ఇక్కడా పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులు సాక్షులే కదా! ఈ సాక్షులు పెళ్ళీ జరిగినదని చెప్పడానికే. తరువాత జీవితానికి కాదు. దేవతలు ఈశ్వరుడు (వారిని నమ్మితే) (నమ్మకపోతే ఈచర్చ దండగ) ఈ వైవాహిక జీవితానికి నిత్య సాక్షులు. మాంగల్యాన్ని దేవతగా పూజించి సూత్రధారణ చేస్తారు. అది ధరిస్తేనే ఆమె అత్తవారింటికి లక్ష్మి. అల్లుడిని నారాయణ స్వరూపముగా భావించి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఇంటికి వచ్చిన నూతన దంపతులను లక్ష్మీనారాయణులు గా చూడాలి. అలాగే భర్త ద్విజుడైతె ఉపవీతం ధరించాలి. శివకల్యాణాన్ని విపులంగా ఈటీవీ ఆరాధనలో ప్రతిఉదయం 6 గంటలతరువాత సామవేదం షణ్ముఖ శర్మగారు ప్రవచనం ఇస్తున్నారు. వినండి.

మన వివాహ వ్యవస్థ – 2
ఇప్పుడు అందరూ రెండు రకాల వివాహాల గురించి చెబుతున్నారు. ప్రేమ (love) వివాహాలు, పెద్దలు చేసిన (arranged) వివాహాలు. ఇది కొంచెం అర్థంలేని విభజన అనిపిస్తుంది. మన సమాజంలో "ప్రేమ" అనే పదం అనేక అర్థాలతోనూ, అనేక విపరీతార్థాలలోనూ వాడ బడుతూంది. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే భావ ప్రేరితమైన సంబంధం. ఇది ప్రతీ వ్యక్తికీ అనేకులతో ఉంటుంది. దీనికీ వివాహానికి సంబంధమేలేదు. Love marriage అంటే నిజంగా "self-arranged marriage". రెండవది "arranged by parents". పూర్వపు శ్లోకము ఒకటి గుర్తుకు వస్తుంది. "కన్యా వరయతే రూపం, మాతా విత్తం, పితా శ్రుతం, బాంధవా కులమిచ్చంతి, మిష్టాన్నమితరే జనాః." కాని ఒక ముఖ్యమైన నిర్ణయం ఒక చిత్త-విభ్రమ స్థితిలో ఎవరికి వారు తీసుకోవడం మంచిదా? మనను ప్రేమించే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడము మంచిదా? ఒక దేశానికి సంబంధించిన నిర్ణయాలు రాజరికములోనో, నియంతృత్వములోనో ఒక్కరు తీసుకుంటారు. ఆధునిక ప్రజా ప్రభుత్వాలలో కాదు. ఒక సంస్థలో ఐనా "brain storming" చేస్తేకాని ముఖ్య నిర్ణయాలు తీసుకోరు. ఇద్దరు వ్యక్తులు "We love each other" అని చెబుతే వారిద్దరూ ఒకరినొకరు సమాన స్థాయిలో ప్రేమిస్తున్నారు అనేది అసత్యం (It is always an asymmetric relationship) వివాహానికి కావలసినది పెళ్ళినాటి ప్రేమ కానేకాదు. రాబోయే కాలములో కష్ట సుఖాలను కలసి పంచుకునే మనస్తత్వం. ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమకంటె త్యాగం, సహనం, పవిత్రమైన బంధం అనే నమ్మకం ముఖ్యం.
భారతీయ వివాహ వ్యవస్థలో మన ఆదర్శం ఇద్దరు మనలాటి మనుష్యులు కారు. జగత్తుకు మాతా పితలైన పార్వతీ పరమేశ్వరులు. వారు సనాతనులు, ఆది దంపతులు అని పురాణాలు ఘోషిస్తున్నాయి. వారే మనకు దాంపత్యధర్మానికి, స్వరూపానికీ ఆదర్శం. మన వివాహానికి అర్థం స్త్రీ పురుషుల కలయిక ఒకటే కాదు. అది జంతు ధర్మం. (ఆహార నిద్రా భయ మైధునంచ, సమానమేతత్ పశుభిర్నరాణాం | బుద్ధిర్హి తేషాం అధికోవిశేషః, బుద్ధ్యావిహీన పశుభిర్సమానః ||) ఇహలోకంలో సత్సంతానం ఒక కోరిక. రెండు అంతఃకరణలు ఒక శ్రుతిలో మేళవించినప్పుడే సత్సంతానం కలుగుతుంది.
వివాహ విచ్చిత్తికి ప్రధాన కారణం ఎవరికివారు ప్రత్యేక వ్యక్తిని అనుకోవడం వలన కలిగే అహంకారం. ఆధునిక విద్యావిధానం దీనిని ప్రోత్సహిస్తూంది. (Competition, Rat-race, one-upmanship, keep running to stand where you are,) వీటినన్నిటినీ ఇంటికి తీసుకొని వెడితే వచ్చే సమస్యలు ఇవి. ఆఫీసులో చెడ్డవాడైన అధికారి వద్ద నలుగుతూ, గతిలేక పనిచేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగినులు ఇంటి దగ్గర కష్టమైన భార్యతోనో, భర్తతోనో ఎందుకు సంయమనం చూపలేరు? ఇదిచేస్తే దీనిలో ఒక ఉత్తమ విలువ కూడా ఉంటుంది. సీతారామ కల్యాణం ఎందుకు స్మరిస్తాం? వారి వివాహం గొప్ప సుఖదాయకమని కాదు. కొద్దిరోజులకే రామునికి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. సీత అనుసరించినది. కష్టాలలో పాలు పంచుకోవడమే ఆదర్శం. స్త్రీ అనుసరించవలసిన ధర్మాలను వివాహ సమయంలో తండ్రి జనకుడు, అరణ్యంలో అనసూయ సీతకి బోధిస్తారు. భర్తను దైవముగా చూడమనే ఆబోధ. లక్ష్మిగా కొలువబడే సీతకు ఆబోధ అవసరమా అంటే అది శ్రోతలందరికీ చెప్పినది. దానికి అర్థం పతి దేవుడు, భార్య సామాన్య మానవ స్త్రీ అని కానేకాదు. దేవుడు మనుష్యుడు సంబంధం యజమాని బానిస సంబంధముకాదు. ప్రత్యేక వ్యక్తిత్వమును పరిత్యజించి, అర్థాంగిగా మారడమే. ఆయన జడుడైన పురుషుడైతే, తాను చైతన్యస్వరూపమైన ఆయన శక్తి. పట్టాభిషేకము తరువాత గర్భవతిగా ఉన్న సీతను ఎవరో ఏదో అన్నారని రాముడు అరణ్యాలకు పంపిస్తాడు. ఆమె వెళ్ళినది. రామాయణంలో అది రామునికి పరీక్ష. దేశానికి రాజుగాను, సీతకు భర్తగానూ నిర్వర్తించ వలసిన ధర్మాల సంఘర్షణ. సీత రాముని ధర్మనిర్వహణకు సహకరించింది. అది ఆమె ఆదర్శం.
ఆధునికులు ఇది రాముని అహంకారము (male chauvinism) గానూ, క్రూరత్వముగాను చిత్రిస్తారు. రంగనాయకమ్మ ఆమధ్య నవ్య వార పత్రికలో “కళ్ళు తెరిచిన సీత” అని ఒక నవలికలో (first-person narrative) సీతలకు విడాకులు ఎందుకు తీసుకోవాలో బోధించింది. వివాహ వ్యవస్థ పై ఇటువంటి సాహిత్యపు ప్రభావముకూడా కొంత ఉండవచ్చు.
మన వివాహ వ్యవస్థ – 3
మన వివాహ వ్యవస్థను గురించి మాట్లాడేటప్పుడు మూడు స్థాయిల్లో ఈ చర్చ జరగాలి. ఒకటి మన ప్రస్తుత సమాజం, రెండవది మన స్మృతి లేక ధర్మ శాస్త్రం, మూడవది మన వివాహములో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మికత. ప్రస్తుత సమాజంలో యుక్తవయస్సులో ఉన్న యువతీ యువకులకు, రెండవ మూడవ అంశాలు చెప్పేవారే లేరు. 
నేటి జీవనవిధానము అనేక సమస్యలతో ముడిపడి జటిలముగా ఉన్నది. వ్యక్తిగత, మరియు కుటుంబ సమస్యలు, చదువులు, ఉద్యోగ వ్యాపారములు, వైద్యసేవలు, ఆర్థిక సమస్యలు ఆధునిక మానవుల జీవనమును సంక్లిష్టముగా చేశాయి. వీనికి తోడుగా సంస్కృతి, మతము, సమాజము, దేశమునకు సంబంధించిన సమస్యలు, పెరిగిన నేరములు కూడా ప్రసార మాధ్యమాలద్వారా నిరంతరముగా ఇంటిలోని వాతావరణమునకు తోడవుతున్నాయి. వాతావరణములోని మార్పులు, పర్యావరణములోని మార్పులు ప్రపంచమంతా చర్చింపబడుతున్నాయి. దీనికి తోడు సామాజిక వ్యవస్థలు, సంప్రదాయములు, విలువలు దిగజారుతున్నాయి. భౌతిక వాదము, భోగ లాలసత, పెరిగిన నూతన వస్తు వినియోగము, వేగము, పనిలో ఒత్తిడి, విశ్రాంతిలేని జీవన విధానము, ఇవన్నీ ఆధునిక జీవనాన్ని పరుగు పందెంలా మారుస్తున్నాయి. ఆధునిక జీవన వేగానికి తట్టుకోలేక అనేకుల జీవితాలు అస్తవ్యస్తమౌతున్నాయి. ముఖ్య విషయాలపై ఉపేక్ష, నిరర్థక విషయాలపై ఆకర్షణ, కాలక్షేపము నేటి సమాజపు లక్షణాలు. పెరిగిన కోరికలు, ప్రలోభాలు, ఇబ్బందులు - వీటి మధ్య మనుష్యుడు మానసిక సంఘర్షణకు, అశాంతికీ, గందరగోళానికీ లోనౌతున్నాడు. సామాన్యులు, ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ఈ ప్రపంచంలోని క్షణిక ఆకర్షణల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈరోజులలో అత్యంత సామాన్యములైన సెల్ ఫోను, ఫేస్ బుక్ వంటి సామాజిక వలయాలు కూడా జీవితాన్ని శాసించేవిగా తయారయ్యాయి. వీని వలన వచ్చే పరిణామాలలో information overload, depression, stress, hyper-tension, black-mailing వంటివి కూడా ఉన్నాయి. ఈ స్థితిలో లౌకిక జీవనము నుండి ధార్మికత, ఆధ్యాత్మికతల వైపు ప్రయాణమే ఉహాతీతము. ఆధ్యాత్మిక సాధనకు ముందుగా భౌతికజీవనము తృప్తికరంగా, శాంతియుతంగా సాగాలి. “శైశవే అభ్యస్త విద్యానాం, యౌవనే విషయేషిణాం | వార్థకే మునివృత్తీనాం, యోగేనాంతే తనుత్యజాం.|| (కాళిదాసు రఘువంశ రాజులను గురించి చెప్పినది.) 
సమాజములో కులము, మతము, సాంప్రదాయము అనేవి ఉన్నాయి. వాటిని వ్యవస్థలలా చూచి వాటిలోని మంచిని గ్రహించాలి. వానిని అడ్డుపెట్టుకొని చేయబడే దుర్వినియోగాన్ని ఖండించాలి. వీటిని ఏవో భయంకరమైన సామాజిక రుగ్మతలలా చూడకపోతే, వానిని గురించి గుండెలు బాదుకోకపోతే వాళ్ళు నేటి అభ్యుదయ కవులేకారు. కాని సత్యంగా ఈ విషయాలను గురించిన అవగాహన తల్లిదండ్రులే పిల్లలకు ఈయాలి . ఈయకపోతే వారేదో ఆదర్శ భారతీయులమని భావించరాదు. ఉదాహరణకు, ఒక బ్రాహ్మణకుటుంబం ఉంటే వారు పిల్లలకు, ఈ విషయాలు చేప్పాలి. కృష్ణయజుర్వేదమని లేదా మరియొక వేద శాఖ, ఆపస్తంభ సూత్రములు లేదా మరియొకటి, గోత్రము, గోత్ర ఋషులు, ఇవి చెప్పుకోవాలి. కులాంతరము అయితే ఈ సంప్రదాయాన్ని పూర్తిగా వదులుకుంటున్నామని చెప్పాలి. అదేదో మహాపాపమనికాదు. కాని తమ, తమ పిల్లల జీవితంలో ఎదుర్కొనబోయే పరిస్థితులను ఊహించుకోవాలి. మతాంతరమైతే వాళ్ళకు హిందువులే లోకువ. ఆఖరు క్షణంలో మతం మార్చుకోవాలని నిర్బంధం చేస్తారు. పెళ్ళికాని వారికి Love jihad, love evangelism అని రెండు ప్రమాదాలు పొంచియున్నాయని చెప్పాలి. ఇవి యేమిటో తేలికగానే ఊహించుకోవచ్చును. వివాహం కేవలము ఇద్దరివ్యక్తుల మధ్య జరిగే సాంఘిక ఒడంబడిక (civil contract) కాదు. ఇంకొక సామాజిక వర్గంతో సహజీవనం అనే విషయం గమనించాలి. ఇద్దరు వ్యక్తులు ఒకరి నొకరు చూచుకుని ప్రేమలో పడిపోరు. ఒకరు, మరి యొకరి వెంట పడతారు. వెంట పడే వారి ఈ ప్రయత్నము వెనుక ఉన్న పథకం ఏమిటి? అని ఆలోచించాలి. కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. IIT లో సీటు, తరువాత ఫారిన్ లో చదువు ముందు, రేపు అన్యమతస్తులైన విదేశీ కోడలో, అల్లుడో వచ్చే అవకాశం ఉంటుందని గమనించాలి. అప్పుడు దానికి విచారిస్తే ఉపయోగంలేదు. "అక్కడ చర్చిలో పెళ్ళి అయినది. మళ్ళీ ఇక్కడ సంప్రదాయ బద్ధంగా పెళ్ళిచేశాం" అని అమాయకంగా చెప్పుకునే తల్లితండ్రులను కూడా ఎందరినో చూశాము, చూస్తున్నాము. ఇంగ్లీషులో wedding, marriage, nuptials అనే మూడు పదాలున్నాయి. మనవాళ్ళకు మొదటి రెండు పదాలకు తేడా తెలియటంలేదు. మూడవపదం ప్రత్యేక పరిస్థితులలొ వాడుతారు. ఇండియాలో క్రైస్తవుల శుభలేఖలలో కనుపిస్తుంది. దాని అర్థం అక్కడ exchanging wedding vows సంప్రదాయబద్ధంగా వివాహం చేయటం అంటే ఏమిటి? Wedding is the act or ceremony of two persons marrying at a given time and place, Marriage is the social institution under which a man and woman live as husband and wife by legal commitments and religious ceremonies మనం వ్యవస్థకు కాకుండా ఉత్సవానికి, వివాహ వేదికకు, వేడుకలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, వ్యవస్థకు ఈయవలసిన ప్రాధాన్యత ఈయటంలేదు. ఉపనయనము, పెళ్ళి లక్షలు ఖర్చుపెట్టే వేడుకలు కావు. అవి భారతీయ జీవితములో ముఖ్య సంస్కారాలు, ఘట్టాలు. వాటిని గురించిన కనీస జ్ఞానము పిల్లలకు ఈయాలి. సినిమాతారల, రాజకీయనాయకుల పిల్లల పెళ్ళిళ్ళు మనం టీవీలో చూచే వినోద కార్యక్రమాలు. అవి మనకు ఆదర్శంకాదు.

మన వివాహ వ్యవస్థ – 4
ఈరోజు మన వివాహ వ్యవస్థను గురించి మాట్లాడేటప్పుడు మన స్మృతి లేక ధర్మ శాస్త్రం, మన వివాహములో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మికత గురించి చూద్దాము. హిందూ వివాహం విడిపోయేందుకు మన ధర్మ శాస్త్రాలు, స్మృతులు అంగీకరించవు. ప్రభుత్వాలు చట్టాలు చేయగలవు కాని ధర్మాన్ని, ధర్మ సూత్రాలను తయారుచేయలేవు. 
మనకు దాంపత్యధర్మమున్నది. మంచి కుటుంబ సౌఖ్యము, సత్సంతానము, అతిథి-అభ్యాగతి సేవ, సమాజసేవ ఇవి కనపడేవి. తాత్త్విక చింతన అంటే ఏమిటి? ఈ దాంపత్య వ్యవస్థ తాత్త్విక మార్గమునకు మార్గదర్శనము చేయగలదా? ఇది ప్రశ్న. మన పూర్వీకులైన ఋషులు మన జీవితగతిని యెలా సూచించారో, దానికి అవసరమైన భూమికయే గృహస్థ ధర్మము. ఎప్పటివారు ఈ ఋషులు? ఎప్పటివి ఈశాస్త్రాలు? అనిప్రశ్నిస్తే అది చాలా ప్రాచీనమని చెప్పాలి, వేల సంవత్సరాలు. తపస్సుతో వారు తెలుసుకున్నది సృష్టి జ్ఞానము. మన దృష్టిలో బ్రహ్మము లేదా బ్రహ్మవస్తువు అని చెప్పబడేది శాశ్వతంగా ఉన్నది. దానిలోనించే స్పందన, గుణములు, పంచభూతములు, ప్రకృతిలోని ఇతర తత్త్వములు పుట్టినవి. బ్రహ్మ వస్తువునుండి తమను తాము సృష్టించుకున్నవారు ఆది దంపతులు. ఒకరి తరువాత ఒకరు రాలేదు. ఒకమాటే వచ్చారు. అంటే ఒకటే పురుషుడు, ప్రకృతిగా రెండయింది. పురుషుడు పరమేశ్వరుడు, ప్రకృతి జగన్మాత. ఆ తత్త్వమునుండే దాంపత్యము అనే తత్త్వము పుట్టినది. వారిని ధ్యానిస్తే మన అంతఃకరణలో కూడా ఒక శుభప్రదమైన పరిణామం వస్తుంది.
ఆదికావ్యం, మహాకావ్యం అయిన రామాయణం ఆ కరుణ రసాత్మక శ్లోకంతో ఆరంభమవుతుంది. 
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునా దేక మవధీః కామమోహితమ్' 
(ఓ కిరాతుడా! మన్మథ పరవశలు అయి ఉన్న క్రౌంచ పిట్టల జంటలో ఒక దాన్ని నీవు చంపివేసినావు. ఇక నీవు అట్టే కాలము బ్రతకకూడదు) (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు). ఒక పక్షి విషాదాంతాన్ని, రెండవ పక్షి రోదననూ చూచిన వాల్మీకి మహర్షి నోటి వెంట అప్రయత్నంగా ఛందోబద్ధంగా వెలువడిన శ్లోకమిది. ఇది శ్రీమద్రామాయణమునకు మంగళాచరణ శ్లోకము. పక్షి దాంపత్యముతో మొదలుపెట్టి సీతారాముల ఆదర్శ దాంపత్యము వరకు వెళ్ళినది వాల్మీకి మహాకవి రామాయణం. దాంపత్యములో సుఖదుఃఖాలు, సంయోగ వియోగాలు ఉంటాయి. ఈ వివాహ వ్యవస్థ వేల సంవత్సరాలనుండే మన దేశములో ఉన్నది. కేవలము క్రమబద్ధమైన సాంఘికజీవనముకోసమే ఇది నియమబద్ధం చేశారా? 
అన్ని మతాలలోనూ వివాహాన్నిగురించిన చర్చలున్నాయి. ఉదహరణకు ఇస్లాంలో ఈ విషయాల చర్చ ఉంటుంది - వైవాహిక ధర్మాలు, వివాహ నిబంధనలు, వివాహానంతరం, వివాహ పద్ధతులు, దాని ధర్మములు, భార్య గుణాలు, వివాహ నిషిద్ధమైన స్త్రీలు, విడాకులు, వివాహ బంధాన్ని నిలుపుకునే, తెంచుకునే స్వేచ్చ, అవిశ్వాసులతో వివాహం, యూద క్రైస్తవ స్త్రీలతో వివాహం వల్ల కలిగే నష్టాలు ( http://teluguislam.net/2011/03/27/fiqh-islami-telugu-islam/) ఇది కేవలం ఒక సాంఘికవిషయం వలెనే కనుపిస్తుంది. క్రైస్తవమతంలోకూడా కొంతవరకు ఇలానే ఉంటుంది. మతాధికారి ఇద్దరిచేత ప్రమాణాలు చేయిస్తాడు. "ఆదం అనే నేను అవ్వ అనే పేరుగల ఈ కన్యను భార్యగా స్వీకరించి, మనసా వాచా కర్మణా ప్రేమిస్తాను. జీవితాంతము వరకు విడువను. క్రీస్తు నాకు ఎలాగో, ఈమెకు నేను అలాగే" అని వరుని చేత, కొంచెం ఇదే తరహా పదాలతో వధువు చేతా ప్రమాణాలు చేయిస్తారు. 
హిందూ వివాహాలలో కూడా సంఘపరంగా ఇటువంటివే ఉంటాయి. వధువు గౌరీ పూజ చేస్తుంది. భర్త చిరకాలము జీవించాలని ప్రార్థిస్తుంది. ఇద్దరూ సుఖముగా ఉండాలి. మంచి సంతానం కలగాలి. ఇవి అందరికీ సమానమే. హిందూ వివాహములో ముఖ్యమైన భేదము మనము దేవతల సాక్షిగా చేసుకుంటున్నాము. హోమములు చేసుకునే సాంప్రదాయములోని వారు అగ్నిసాక్షిగా అనిచెబుతారు. వివాహ మంత్రాల ప్రకారము ఆమె దేవతలకు భార్య అయిన తరువాతనే వరుడు ఆమెకు భర్త అవుతాడు. శరీరములో ప్రతి అవయవమునకు అధిదేవతలు ఉంటారు. దేవతలు శాశ్వతముగా శరీరములో ఉండి రక్షిస్తారు. స్త్రీత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ మానవ వరుడు వారి సాక్షిగా వివాహముచేసుకొని మాతృత్వాన్ని ఇస్తాడు. ఆదేవతలే జన్మజన్మలకూ వారిమధ్యనే దాంపత్యాన్ని కలిగిఉండే అవకాశాన్ని ఇస్తారు. ఎన్నో జన్మల అనుబంధం అంటే ఇదే. ఋణాలు తీర్చుకునే అవకాశం ఇస్తారు. ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగిస్తారు, లేదా మోక్షమార్గం చూపిస్తారు. జాతకములు చూపించుకోవడంలో కూడా పరమార్థం అదే. ఏ దేవతలైతే గ్రహాలకు అధిదేవతలుగా ఉన్నారో వారే వివాహానికి సాక్షులౌతున్నారు. దీని వలన వివాహంలో అనుకూల్యత వచ్చే అవకాశం ఉన్నది. నేను హిందువుని అంటే నేను వేదాన్ని ప్రమాణముగా తీసుకుంటాను అనే అర్థం. నేను వేదాలలో చెప్పబడిన దేవతలను, వారిని గురించిన జ్ఞానాన్ని మనకు ఇచ్చిన ఋషులనూ నమ్ముతాను అనే అర్థం. వేదాలను నమ్ముతాను వేదాంతాన్ని నమ్మను, వేదాంగాలను నమ్మను అంటే అర్థంలేదు. దేవుడు సత్యం, అందరు దేవతలు అక్కర లేదు, జ్యోతిషం అసత్యం, మూఢ విశ్వాసం అనే హిందువునకు తన మతము తనకు తెలియదనే అర్థము.

మన వివాహ వ్యవస్థ – 5 ( హిందూ వివాహ వ్యవస్థ - ధర్మము - శాసనము (చట్టము)) 

వార్తా పత్రికలు చూస్తే అన్నీ స్త్రీలమీద జరుగుతున్న నేరాలే, అత్యాచారాలు, దాడులు, వేధింపులు, గర్భస్థ శిశు హత్యలు. గర్భస్థ శిశువు, చిన్న బాలిక, విద్యార్థిని, ఉద్యోగిని, గృహిణి, వృద్ధ వనిత అందరిపై ఈ ప్రభావం పడుతోంది. కొన్ని వార్తలుగా మిగిలిపోతాయి, కొన్ని కొంత ప్రచారాన్ని పొందుతాయి. ఆ బాధితులకు న్యాయం జరుగకపోయినా కొన్ని సంస్కరణలకు, నేరాలను అరికట్టగల చట్టాలకు దారితీస్తాయి. చట్టాలలో loopholes మరికొన్ని నేరాలకు దారితీయవచ్చు. పురుషులకంటె స్త్రీకి సమస్యలు ఎక్కువ (more vulnerable). ఇందులో చాలా ప్రత్యక్షంగాను, కొన్ని పరోక్షంగాను వివాహ, కుటుంబ వ్యవస్థకు సంబంధించినవే. Civil lawలో ఉన్నభేదాల వలన కేవలం హిందూవివాహమే ఇక్కడ ముఖ్యం. వివాహానికి ఒక Code of Conduct ఉంటుంది. మత పరంగా అది స్మృతి, నీతి, ధర్మ శాస్త్రాలపై ఆధారపడిఉంటుంది. ఇవి కొంతవరకైనా తెలుసుకోవటం ఈకాలంలో హిందువులకు అసాధ్యం, ఇతర మతస్థులకు సాధ్యం. ఇస్లాం వెబ్ సైట్ ఈ మాటను నిరూపిస్తుంది. క్రైస్తవులకైనా అంతే. మరి హిందువులు ఏమిచేయాలి? చాలా కుటుంబాలలో ఇంకా సదాచారములు, పద్ధతులు మిగిలి ఉన్నాయి. వాటిని అనుసరించడమే. భగవంతుని ఆరాధించడానికి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత వేదాంతాలన్నీ తెలుసుకోనక్కరలేదు. ఆరాధిస్తే ఫలం వస్తుంది. నీకు చేతనయినది చేసుకొ - పూజ, అర్చన, నామస్మరణ, ధ్యానం, కనీసం దీపారాధన చేయి. క్రమేణా వినడం వలన, పెద్దలను అడగడం వలన, చదవడం వలన విషయాలు అవే బోధపడతాయి. 
గత శతాబ్దములో మనందరినీ skeptics నిత్యశంకితులుగా చేసినది మన ఆధునిక విద్య - ముఖ్యంగా సైన్స్. సాంప్రదాయాన్ని, విశ్వాసాలనీ చిన్న చూపుచూసేటట్లు చేసినది ఈ విద్యయే. "విద్య యొసగును వినయంబు" అనే సుభాషితం మరచిపోయి, ఒక అహంతను తయారుచేస్తున్నది. ఒక ఇంటర్ వ్యూ కు వెళ్ళినప్పుడు , ఒక సెమినార్ ఇచ్చినప్పుడు self confidence గా ఉన్నంతవరకు అది అవసరమే. విజిటింగ్ కార్డ్ మీద VVS Sarma, PhD, FNA, Distiguished Professor అని వేసుకొని ఎవరికైనా ఇస్తే ఆసమయానికి కొంత గుర్తింపు రావచ్చు. కాని ఇది ఇంటిలో భార్య వద్ద ఎందుకు పనికి వస్తుంది? "లేత వంకాయలు ఏరుకొని తీసుకురాలేరు, చెప్పిన వాటిలో సగం మరచిపోతారు. ఎవరు ఇచ్చారు మీకు డాక్టరేట్?" అని భార్య ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఒక దేవుడి విగ్రహమో, చిత్రపటమో, ఒక సద్గురువు చాయా చిత్రమో పెట్టుకుని చేసే పూజలకు ఫలముంటుందని ఎవరు చెప్పారు? సైంటిఫిక్ గా నిరూపించండి అని యే జన విజ్ఞాన వేదిక వాడో అడిగితే చాలామంది తగిన సమాధానం చెప్పలేరు. ఇంత విజ్ఞాన శాస్త్రపు అభివృద్ధి వలన ప్రపంచానికి లాభం కలిగినదా? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి, సైంటిస్టులది. 
నా దృష్టిలో ప్రశ్నించడం కంటె ఆప్తవాక్యాన్ని, సాంప్రదాయాన్నీ విశ్వసించడం శ్రేయస్కరం. 
పెళ్ళిళ్ళలో జాతకాలు చూడడం ఎందుకు? అవసరమా? 
నిజానికి అంతకంటె అవసరం Proper Counselling. జాతకాల మీద ఉండే నమ్మకం, వ్యక్తుల విలువలపై ఉంటే జాతకాలు ముఖ్యం కాదు. జాతకం perfect match అని చెబితే కాపురం సజావుగా జరుగుతుందని గారంటీ లేదు. అసలు సమస్య జాతకం అంటే, జ్యోతిషం అంటే ఏమీ తెలియకపోవడం. జ్యోతిషం అంటే కాల నిర్ణయాన్ని, గ్రహ గతులను చెప్పే శాస్త్రం. పంచాంగమును గుణించడం, పెళ్ళికి ముహూర్త నిర్ణయం చేయడం దీని పరిధిలోకి వస్తుంది. దానిని బట్టి భవిష్యత్తుని చెప్పగలగడం ఒక కళ. ఉదాహరణకు శాస్త్రం విడాకులపై ఏమీచెప్పదు. ఎందుకంటే ఈ శాస్త్రాలు వ్రాసేటప్పటికి ఆ ప్రసక్తిలేదు. కాని శాస్త్రసూచనలను ఈకాలానికి అన్వయించిచెప్పగల జ్యోతిష్కులు కావాలి. వారు చెప్పినా సూచన మాత్రంగానే చెప్పగలరు. సూచన లభిస్తే, దానిని పరిగణన లోనికి తీసికొని తన విలువలు, భగవంతునిపై విశ్వాసము ద్వారా ఆపరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఈకాలములో ఇద్దరూ కూర్చుని అన్నివిషయాలు మాట్లాడుకోవడము మంచిది. వివాహం జీవితంలో ఒకేసారి అనే విలువ ఇద్దరికీ ఉంటే పరిస్థితి అంతవరకూ రాదు. అప్పుడు జాతకాలు పుచ్చుకొని పరుగెత్తడం అర్థ రహితం.

సిద్ధాంత శిఖామణి శ్లోకం

రచన : శ్రీ వి. వి. ఎస్ . శర్మ గారు , బెంగళూరు .

శివయోగి శివాచార్యుని సిద్ధాంత శిఖామణి మొదటి శ్లోకం చూదాం. దీని వివరణ వీరశైవ సిద్ధాంత అవగాహనకు తోడ్పడుతుంది
ఓం నమః శివాయ 
శ్రీ జగద్గురు పంచాచార్యా ప్రసీదంతు 
త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే, 
సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః.
. శివునికి ఐదు ముఖాలు - సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ ఐదుగురి అంశలలో ఉద్భవించినవారు పంచాచార్యులు. వారు చారిత్రక వ్యక్తులో, కాదో తెలియదు. స్వయంభువులుగా చెప్పబడుతారు. వారిపేర్లు రేణుకాచార్య, మరుళారాధ్య, ఏకోరామారాధ్య, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవారు.వారి అనుగ్రహాన్ని కోరుదాం. ఈ సిద్ధాంత శిఖామణి రేణుకాచార్య, అగస్త్య సంవాదంగా చెప్పబడుతుంది. ఈ వీరశైవ సామ్రాజ్యానికి ఐదు ముఖ్య పీఠాలున్నాయి. వానిని మొదట పాలించినది పంచాచార్యులు. అవి బాళేహెణ్ణూరు, ఉజ్జయిని (ఉజ్జిని)(కర్ణాటక), కేదారనాథ్ (ఉత్తరాఖండ్) , శ్రీశైలం, కాశీ.
మొదటి శ్లోకం మంగళాచరణం. అందులోనే తత్త్వం నిక్షిప్తమైఉంది. భిత్తి అంటే గోడ. అంటే పరమేశ్వరుణ్ణి ఒక గోడతో పోలుస్తున్నాడు. ఆ గోడ మీద రచింపబడినది (చిత్రించబడినది) త్రైలోక్యసంపదగా చెప్పబడే జగత్తు. ఆగోడ శాశ్వతం, దానిమీద చిత్రాలు మాత్రం కాలగమనంతో మారిపోతూ ఉంటాయి. కాని ఆగోడ సాక్షిగా, నిర్లిప్తంగా, శాశ్వతంగా ఉండనే ఉంటుంది. గోడలేక పోతే చిత్రమేలేదు. సంపద అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం ఈశ్వరలక్షణం. జగత్తులోని త్రిలోకాలే సంపద. అద్వైతులు జగత్తు మిథ్య అంటారు. సత్ పదార్థామైన ఈశ్వరుడు సత్యమైతే ఆయన సృష్టించి, సర్వదా వ్యాపించిఉన్న జగత్తు అసత్యము, మిథ్య ఎలాగ అవుతుందని శైవుల వాదం. పరమేశ్వరుడు ఒక గోడవలే స్థాణువుకాదు. శక్తితోకూడిన చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపమే సచ్చిదానందము అవుతుందని రెండవ పాదములో నిరూపింపబడుతూంది.
సత్ అనేది శాశ్వతమైన ఉనికిని సూచించే పదము. ఆ ఉనికి ఎలా తెలుస్తుంది? చిత్ (చిత్తము వలన). ఇంద్రియాలు, మనస్సు ఈ చిత్ కి ఈ ఉనికికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తాయి. చిత్ ఉంటేనే ఆనందము. లోకంలో ఉండగలగడమే ఆనందం. అనంతమైన సచ్చిదానంద స్వరూపమే ఈశ్వరుడు. ఈ సందర్భాన్నే రమణమహర్షి సినిమాతెరమీద చలనచిత్రంతో పోలుస్తారు. మరిదుఃఖమో. అదితెరమీద పాత్రలది. జీవుడు శరీరాన్ని తాను అనుకోవడం వలన క్షణికమైన సుఖ దుఃఖాల అనుభవం ఊహించుకుంటాడు. తెరకు దీనితో సంబంధం లేదు. ఈ కాలంలో మనం Facebook Wall కూడా ఉపమానంగా తీసుకోవచ్చును. జీవుడు శివోహం అనేస్థితికి వస్తే అంతా ఆనందమే, దుఃఖం దరికిజేరదు. ఈ చిత్ అనేది పరమేశ్వరుని శక్తి. జీవునికికూడా చిత్తము ఉంటుంది. కాని నిద్రపోయినపుడు అది పనిచేయుటలేదు. జీవుని శక్తి పరిమితము. పరమేశ్వరుని చిచ్ఛక్తి అపరిమితము. అదియే ఆది పరా శక్తి. సచ్చిదానంద స్వరూపుడు, పరబ్రహ్మ తత్త్వ స్వరూపుడు, ఐన శివునికి నమస్కారము అనిచెబుతుంది ఈశ్లోకం. శైవులది యోగ మార్గం. మూలాధారస్థితుడైన గణపతినుండి ప్రారంభించి, కుండలినిజాగృతిపొంది చేసే సాధనా మార్గమే యోగము. (ఆధారం - సద్గురు శివానందమూర్తిగారి ప్రవచనం.)