Tuesday, April 17, 2012

రాధికా సాంత్వనం





రాధికా సాంత్వనం


ముద్దుపలిని(1730 -1790 ), 18  వ శతాబ్దం లోని తంజావూరు నాయక రాజుల ఆస్థాన విద్వాంసురాలు. ఈమె 


వివిధ కళల లో  నిష్ణాతురాలే కాక, తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టు ఉన్న రచయిత్రి. సహజంగా 


సాహిత్యాభిమానులు, కళా పిపాసులు, అయిన తంజావూరు రాజులు సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉన్న స్త్రీలను 


కూడా గౌరవించి, పురుషులతో సమానంగా గౌరవించి, కొలువు ఇప్పించేవారు. ఆంధ్ర నుంచి వలస వచ్చిన ఈ 


దేవదాసీలు , అదృష్ట చిహ్నాలుగా, సంఘం లో గౌరవాన్ని పొందేవారు. 

ముద్దుపలిని తెలుగులో రచించిన 'రాధికా సాన్త్వనం'( రాధిక సాంత్ -వనం: రాధికను సమింపచేయడం) లో , 



రాధాకృష్ణులకు సంబంధించిన 584  పద్యాలు ఉన్నాయి. ఈమెకు కృష్ణుడు స్వయంగా చిన్న బాలుడిగా, కలలో 


కనిపించి, ఈ కావ్యాన్ని వ్రాయమని చెప్పాడట. ఈమె కావ్యాన్ని రచించి, కృష్ణుడికి అంకితం ఇచ్చిందట. 


'శృంగారప్రబంధం' అయిన ఈ కావ్యం లో,  శృంగార రసాన్ని ప్రతిబింబించిన ఈ కావ్యం,  సంఘం చేత 


బహిష్కరించబడి, తగులబెట్టబడినా, ఇంకా కొన్ని ముద్రణలు అందుబాటులో ఉండడం వల్ల  వెలుగులోకి వచ్చింది.


ముద్దుపళని అమ్మమ్మ, అమ్మా కూడా రచయిత్రులట. తన గురించి తను ఇలా వర్ణించుకుంటుందట.


'నా కులంలో జన్మించిన యే వనితకు, ఇన్ని బహుమానాలు, పండితురాలి గౌరవం దక్కింది? ఇన్ని కావ్యాలు అంకితం ఇప్పించుకునేంత మర్యాద దక్కింది? ప్రతి కళ లో ప్రత్యేకమయిన స్థానం దక్కింది? ముద్దుపళని, నీకు నీవే సాటి'


'పూర్ణ చంద్రునిలా వెలిగే మోము, ముఖ వర్చస్సుకు తగిన వాక్చాతుర్యం, మాట్లాడేటప్పుడు, దయాగుణాన్ని ప్రతిబింబించే కళ్ళు, కళ్ళలోని కాంతులకు జతకూడే ఉదార స్వభావం, ఇవే రాచకోలువులో, పలని ని భుషించే అలంకారాలు.'


కృష్ణుడికి ప్రియమయిన రాధ, కృష్ణుడి నూతన వధువయిన, తను పెంచిన, ఇలాదేవి అనే యువతి తో  తన 


అనుభవాలను పంచుకున్టుందట. శృంగారంలో స్త్రీ పాత్ర,  స్త్రీ పురుష అసమానతలు, తన ఇష్టాలను నిస్సంకోచంగా 


వ్యక్త పరచమనే విధానం, చూపవలసిన చొరవ, అన్నీ సవివరంగా వర్ణిస్తుంది. కృష్ణ, ఇలలు ఒకరిని ఒకరు వదలలేని


స్థితికి చేరుకుంటారు. విరహతప్త అయిన రాధ, కృష్ణునిపై ద్వేషాన్ని పెంచుకుంటుంది. చివరికి కృష్ణుడు రాధ 


కోపాన్ని, తాపాన్ని యే విధంగా శమింప చేసాడనేది కావ్య ఇతివృత్తం. స్త్రీ హృదయం ఆశించేది, పురుషుడి నుంచి 


లభించే ప్రేమను, స్వాంతనను  అని, చివరికి తెలియజేస్తుంది. రాధ పాత్ర ద్వారా, తనను తానూ ఆవిష్కరింప 


చేసుకుంటుంది, రచయిత్రి. ఇందులో స్త్రీ హృదయం లోని సున్నితత్వం, శృంగార పరంగా అసూయతో కూడిన 


దృక్పధం, తెలిసిన రాదా కృష్ణుల కధలో, ఆవిడ సృష్టించిన వైవిధ్యం, చెప్పుకోదగినవి.


'ముద్దు పెట్టద్దంటే, చెక్కిలి తట్టి, గట్టిగా నా పెదవులని ముద్దాడుతుంది, నన్ను మైమరపిస్తుంది, తన మాటలతో, 


చేష్టలతో, పదే పదే తనను ప్రేమింపచేసుకుంటుంది, తన చీర రవికనయినా బాగుండును, మత్స్య కూర్మ 


అవతారాలతో నన్ను పోలుస్తారు...రాధా.. ఎలా నీ నుంచి, నీ సాంగత్యం నుంచి, దూరంగా ఉండడం?


ఈవిడ రచనను స్త్రీ జనోద్ధరకులుగా, సంఘ సంస్కర్తలుగా చెప్పుకునే, ఆ నాటి పురుషులు కూడా అంగీకరించలేక ,


 ఈ కావ్యం చదవకూడదని , ముద్దుపళని విసృన్ఖల స్త్రీ అని ముద్ర వేసారు. మొత్తానికి ముద్దుపళని రచన 


పురుషాధిక్య శృంగారానికి ఒక ధిక్కారం. స్త్రీల దృక్పధాన్ని, స్త్రీ మనసును ఆవిష్కరించిన ధీర, ముద్దుపళని.  


http://javous308.blogspot.in/2011/05/women-well-set-free.html

No comments:

Post a Comment