Saturday, September 8, 2012

భక్త జయదేవుడు



భక్త జయదేవుడు 

కొంత మంది పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 13 వ శతాబ్దానికి  చెందిన, వ్యాసుని అవతారంగా భావించే '
జయదేవుడు' ఇటువంటి వారిలో ఒకరు. ఈయన  జీవితం, పూర్ణ భావంతో, భక్తీ విశ్వాసాలతో, సాధన చేస్తే,
భగవంతుడే, అనేక  రూపాల్లో వచ్చి రక్షిస్తాడని, తెలియజేస్తుంది. బాల్యంలోనే ,ఆశుకవిత్వం చేప్పారు,
ఏకసంధాగ్రాహి , జగన్నాధుని భక్తుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు
కనిపించడంవల్ల, బహుళ ప్రజాదరణ పొంది, ప్రతి నోటా, వినిపించసాగాయి. జగన్నాధుని భక్తుడయిన కళింగ రాజు,
తన పాటలను కాక, జయదేవుడి పాటలు ఎక్కువ ప్రాచుర్యం పొందడం సహించలేక, పండితుల సలహాతో, ఇరువురి
కీర్తనలను ఒక రాత్రి, జగన్నాధుని గుడిలో ఉంచుతాడు. ఉదయానికి, రాజుగారి గ్రంధం ముక్కలుముక్కలయ్యి
ఉండడం చూసి, అభిమానపడి, ప్రాణత్యాగం చెయ్యబోతాడు. అప్పుడు జగన్నాధుని విగ్రహం లోనుంచి,
'రాజా! మీ ఇద్దరి కవితలూ గొప్పవే, ఈర్ష తో, అధికార బలంతో, నువ్వు ప్రవర్తించడం వల్ల, నీ కీర్తనలు నేను
స్వీకరించలేదు, ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి కనుక, నీ పాటలను కూడా కొన్నిటిని స్వీకరిస్తున్నాను,' అన్న
మాటలు వినిపించాయి.

జయదేవుని భార్య పద్మావతి, అతని కవితా స్పూర్తి. ఆయన రాసిన గీతాలను, నాట్యంతో, చక్కగా అభినయించి
చూపేది. ఆ మహా భక్తుని, భార్యగా ఉండడం గొప్ప అదృష్టంగా భావించిన మహాపతివ్రత. ఒక సారి, జయదేవుడు
ప్రక్క ఊరిలో,భాగవత సప్తాహం చేసాడు. ప్రతిఫలం ఆశిన్చడని తెలిసిన షావుకారు, నలుగురు సేవకులతో,
మణిమాణిక్యాలు, బంగారం, రహస్యంగా, ఆయన వెంట వెళ్లి, పద్మావతికి ఇచ్చిరమ్మని పంపాడు. ఆ నలుగురు
సేవకులూ, స్వార్ధంతో కుమ్మక్కయ్యి, జయదేవుడి, కాళ్ళు-చేతులు నరికేసి, ఒక పాడుబడిన బావిలో పడేసారు. ఆ
దారిలో వెళుతున్న వింధ్య రాజు, బావిలోంచి, 'కృష్ణా! కృష్ణా!' అన్న మాటలు విని, ఆయనను బయటకు
తీయిన్చేసరికి, లీలగా, ఆయన కాళ్ళు- చేతులు తిరిగి వచ్చేసాయి. ఆ రాజు జరిగింది తెలుసుకుని, సంతోషించి, తన
రాజ్యంలో కూడా భాగవత సప్తాహం జరపాలని, ఆయనను పద్మావతీ సమేతంగా తీసుకువెళ్ళాడు. ఆ సప్తాహానికి,
లోగడ ఆయనను బావిలో పడేసిన నలుగురు దొంగలూ వచ్చారు. భక్తి పారవశ్యంలో ఉన్న జయదేవుడు, వాళ్ళను
చూడగానే, హటాత్తుగా వెళ్లి, కౌగిలించుకున్నాడు. వాళ్ళను సత్కరించి పంపాల్సిందిగా, రాజుకు చెప్పాడు. అయితే,
వెళ్ళే దారిలో, వాళ్ళు మట్టిలో సగానికి కూరుకుపోయారు. జయదేవుడికి, వారి దీనావస్తకు, దయ కలిగి, 'హే కృష్ణా!
వీళ్ళను రక్షించు తండ్రి!' అని ప్రార్ధించాడు. భక్తుని మాట మన్నించి, వారిని రక్షించాడు దేవుడు.

పద్మావతికి, వింధ్య రాణికి మంచి స్నేహం కుదిరింది. ఒక రొజు, రాణి గారు పంతం కొద్దీ, పద్మావతిని పరీక్షించాలని,
భటుడితో, 'జయదేవుడు, వేటలో పులి బారిన పడి చనిపోయాడని', అబద్ధం చెప్పిస్తుంది. ఆ వార్త వినగానే, ప్రాణాలు
విడుస్తుంది పద్మావతి. సిగ్గుతో ప్రాయశ్చితం చేసుకోబోయిన రాజ దంపతులను, జయదేవుడు వారించి,ఒక
అష్టపదిని గానం చేస్తాడు. శ్రీ కృష్ణ పరమాత్మ కరిగిపోయి, పద్మావతిని తిరిగి బ్రతికించాడు. ఈ ఉదంతం,
అష్టపదులకు ఉన్న మహత్తును, సంజీవిని శక్తిని తెలియజేస్తుంది.

జయదేవుడు అనగానే, అష్టపదులు గుర్తుకు వస్తాయి. ఈ అష్టపదులు 'గీతగోవింద మహాకావ్యం ' లోనివి. 'జయదేవ
అష్టపదులలో', 24 అష్టపదులు , ప్రతి ఒక్కటి, ప్రత్యేకమయిన రాగంతో, తాళంతో రచింపబడ్డాయి. ఈ గీతి కావ్యంలో

మూడే పాత్రలు –
రాధ, కృష్ణుడు మరియు సఖి. విరహవేదన ఈ కావ్యంలోని విషయం. ఇందులో లౌకికంగా శృంగారం కనిపించినా, ఆధ్యాత్మికతే ప్రధానం. భక్తి శృంగారం ఇందులో ఎంతోమధురంగా కలసిపోయాయి. ఇందులోని సఖి నాయికా-నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేసివారిని సన్నిహిత పరచడానికి ప్రయత్నిస్తూ – ప్రేయసీ ప్రియుల ఆనంద సమాగమానికిదారితీస్తుంది. అష్టపదులలోని అర్ధాలను చక్కగా విశ్లేషణ చేసి, ఆ మహాత్ముడి
హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.జయదేవుడు దశావతారాల గురించి వ్రాసిన కావ్యం, 'దశకృతికృతే''. కృష్ణుడు మూడుముఖాలతో వేణువు వాయిస్తున్నట్టు వర్ణించే కావ్యం, ''త్రిభంగి'' అతని వల్లే ప్రాశస్త్యము నొందింది. ఫ్రజల గుండెల్లోఅజరామరంగా నిలిచిపోయిన ఆయన యొక్క గీతగోవింద మహాకావ్యం భావికాలంలో నారాయణతీర్ధ
వంటి మహావాగ్గేయకారులకుస్పూర్తిదాయకమయ్యింది. అంతేకాకుండా అనేకమంది దీనిని ఆంగ్లం, జర్మన్,
ప్రెంచ్, లాటిన్మొదలైనభాషల్లోకి అనువాదం చేశారు. మొట్టమొదట విలియం జోన్స్ చేసిన ఆంగ్ల అనువాదం
పెద్ద సంచలనాన్నే కలిగించింది."ఆర్నాల్డ్ సాంగ్ ఆఫ్ సాంగ్" పేరుతో చేసిన ఆంగ్లభావానువాదం చాలా ప్రాచుర్యం పొందింది. గీతగోవింద కావ్యం లోని కొన్ని పద్యాలు, చూద్దామా!

''చందన చర్చిత నీలకళేబర
పీత వసన వనమాలీ
కేళిచలన్మణి కుండల మందిత
గండయుగ స్మితశాలీ...''
ఓ శృంగార భావాలుకల రాధా! గంధం పూసిన నల్లనైన శరీరం మీద పచ్చని వస్త్రంధరించినవాడు , పాదాలవరకు వేలాడే వనమాల ధరించినవాడు అయిన శ్రీ కృష్ణుడు ఈ వసంత ఋతువులో గొప్పతనము కలిగిన అందమైన స్త్రీల సమూహములో విహరిస్తున్నాడు. ఆయనగారు ఆటలు ఆడటం వల్ల చెవులకు పెట్టుకొన్న రత్న కుండలాలు కదులుతున్నాయి . చెక్కిళ్ళమీద ఇంకా ఏమీ ఆభరణాలు అక్కర్లేదు. ఆయన చిరునవ్వులే ఆభరణాలు .

" నిందతి చందన ఇందు కిరణమను విందతి ఖేద మధీరం.....
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరం....
మాధవ మనసిజ విశిఖ భయాదివ భావనయా త్వయిలీనా.....
సావిరహే తవదీనా....సావిరహే తవదీనా....."

కృష్ణుడు లేక రాధ పడుతున్న బాధను వర్ణిస్తూ.....ఆమె చెలి పాడే ఈ గీతం, రాధమనోవేదనను కళ్ళముందు నిలుపుతుంది. 'రాధ విరహం చేత చల్లని వస్తువులయిన గంధాన్నీ, వెన్నెలనీ, మలయమారుతాన్నీ తట్టుకోలేక దూరంగా మసలుకుంటున్నది. ఇవేవీ రాధకి శాంతినివ్వడం లేదు. మన్మధ బాణాల తాకిడికి భయపడిన దీనురాలైన రాధ అనుక్షణమూ నీ భావనలో లీనమై ఉన్నది.'

No comments:

Post a Comment