Saturday, September 8, 2012

కవులు



కవులు
అసలు మా కవుల/ రచయతల/ రచయిత్రుల గురించి ఇంద్రగంటి హనుమాచ్చాస్త్రి గారు ఏమన్నారో తెలుసాండి? ' ఈ కవి గాళ్ళు ఉన్నారే,

వీళ్ళది చింతపండు జాతి. రాగి చెంబు లాంటి లోకాన్ని ఎంత తోమినా, కిలుము వదిలించగాలమా?' అని.

మరో శ్రీలక్ష్మిలా నేను చెప్పాలంటే, ' ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, పాత రచయతలయితే, కాగితం, కలం తీసేసి, రాసి పారేస్తారు.
    
 నవీనులు, కంప్యూటర్ ఆన్ చేసి, కీ బోర్డు మీద టైపు చేసేసి, లోకాన్ని కడిగి పారేస్తారు. లోపాల్ని ఉతికి ఆరేస్తారు. బంధాన్ని, అందాన్ని పొగిడి

 పారేస్తారు. మంద బుద్ధుల్ని చెరిగి పారేస్తారు. అదండీ సంగతి.

అసలు ఒక్క అడుగు వేసి, అందరిలో తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరచాలంటే, ఎంతో ధైర్యం, చొరవ కావాలి. ఎవరు మెచ్చినా,

విమర్శించినా, తాము నమ్మినది కుండ బద్దలుకొట్టినట్టు చెప్పగలగాలి. రాజకీయాలు, సామాజిక పరిస్తితులు, వ్యక్తుల మనస్తత్వాలు,

సినిమాలు, ఇలా ఏదయినా ఆ రొజు, ఆ నిముషంలో వాళ్ళ గుండె తలుపు తట్టే అనుభూతులను, మీ ముందుకు అక్షర రూపం లో తీసుకు

రావాలి. ఆ అక్షరాలు అర్ధవంతంగా, ఎదుటివారికి తమ భావాన్ని సుస్పష్టంగా తెలియచెయ్యాలి. ఏది బడితే, అది గజి బిజి గా రాసి పారేస్తే,

జనాలు సన్మానం చేసే అవకాశాలు భేషుగ్గా ఉన్నాయి.

'మరి మీ ప్రయాసతో సమాజాన్ని మార్చగలరా? ' అంటారా. సహజంగా మార్పు వ్యక్తి నుంచి కుటుంబానికి, కుటుంబం నుంచి సమూహానికి,
 
సమూహం నుంచి సంఘానికి వ్యాపిస్తుంది. ఒక్క రోజులో, పెను మార్పులు రాకపోయినా, కొద్దీ కొద్దిగా స్లో పాయిసన్ లాగ, మార్పుకు మీలో

అంకురార్పణ చేసి, చిగురింప చేస్తాం. అది మీకే తెలియకుండా, మీలో నిద్రాణంగా ఉండి, అవసరమయినప్పుడు, తుఫాను తాకిడి లా

పెల్లుబికి, మార్పుకు దోహదపడుతుంది. అదన్నమాట.

అయినా, ఏదో, ఒక గ్రూప్ పెట్టేసి, కొన్ని రాతలు రాసేసినంత మాత్రాన, మీరు పెద్ద రచయిత్రి లా ఫీల్ అయిపోతున్నారా, అంటారా? నా సంగతి

 మీకు తెలియదండోయ్ , ' నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కాదన్న వాడిని రాయిచ్చుక్కోడతా.' జై శ్రీలక్ష్మి, జై

చంటబ్బాయ్ సినిమా.

 

No comments:

Post a Comment