Saturday, September 8, 2012

అశ్వఘోషుడు




అశ్వఘోషుడు

సంస్కృత వాన్గ్మయంలో కాళిదాసు వంటి కవుల సరసన పీటం వేయదగిన మహాకవి అశ్వఘోషుడు. బుద్ధుడి 

జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని, యితడు రచించిన రెండు మహా కావ్యాలు 'సౌందరనందం', 'బుద్ధచరితం'. 

అశ్వఘోషుడు 'మగధ' రాజ్యంలో ఉండేవాడు. రాజు తన ఆస్తానంలోని మిగతా కవులకు, అశ్వఘోషునిపై ఉన్న 

మాత్సర్యం గమనించి, వారికి అశ్వఘోషుని వైశిష్ట్యం తెలియ చెప్పాలని, తన అశ్వశాల లోని అశ్వాలకు ఒక 

రోజంతా ఆహారం ఇవ్వకుండా మరునాడు వాటి ముందు ఆహారం ఉంచి, అశ్వఘోషుడిని పద్యాలు

చదవమన్నాడట. అశ్వఘోషుడు వాటిని పటించడం మొదలు పెట్టగానే, ఆ గుర్రాలన్నీ ఆహారం ,ముట్టకుండా 

కళ్ళలో నీళ్ళు నింపుకున్నాయట. ఆ నాటి నుండి అతడి పేరు 'అశ్వఘోషుడిగా' ప్రచారమయ్యింది. కనిష్కుడు 

మగధ రాజుపై దండెత్తి, ఆ రాజును వాదించి, అతనితో బుద్ధుడి అస్తికలను, అశ్వఘోషుడిని తనకు 

సమర్పించాలని అడిగాడట. అది విని మగధ రాజు, అస్తికలను ఇవ్వడానికి వప్పుకున్నాడు కాని, అశ్వఘోషుడిని 

వదలడానికి ఇష్టపడలేదట.

అశ్వఘోషుడు వైదీక ధర్మావలంబి. బౌద్ధ ధర్మ విరోధి. మగధ నగరంలో ఒక గంట  వేలాడదీయించి, తనతో 

వాదంలో గెలిచిన వారు తప్ప ఎవరూ దానిని తాకరాదని ఆంక్ష విధించాడట. ఒక నాడు 'పార్స్వుడు' అనే బౌద్ధ 

మత గురువు వచ్చి, అతనిని ఒక ప్రశ్న అడిగాడు...

" ఈ ప్రపంచంలో శాంతి, సమ్రుద్ధమయిన స్థిరమయిన రాజ్యము, ప్రజలు దుఖానికి గురి కాకుండా ఉండడము-- 

ఇవి కావాలంటే, ఏమి చెయ్యాలి?" ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని అశ్వఘోషుడు, అతడి శిష్యుడయ్యాడు . ఆ 

తరువాత బౌద్ధ మత ప్రచారానికి పూనుకున్నాడు. కనిష్కుడు అతనికి తన ఆస్థానంలో ఉన్నత స్థానం 

కల్పించాడు. బౌద్ధ మత గ్రంధాలలో అశ్వఘోషుని పేరు స్మరించబడుతుంది. ఈ కావ్యాలలో ఇతిహాస, పురాణాల

లోంచి ఉదాహరణలు బహుళంగా కనిపిస్తాయి. స్వర్గం, దేవ లోకం, దేవ పురుషులు ఇత్యాదులు వర్ణించబడ్డాయి. 

భారతీయ తత్వ శాస్త్రాన్ని తెలిసిన మహా దార్సనీకుడు 'అశ్వఘోషుడు' బుద్ధుని జ్ఞాన పిపాస పట్లా, అహింసా 

వాదం పట్లా ప్రభావితుడై బౌద్ధ మతాన్ని సమర్ధించాడు. ఇతని సుకుమారమయిన శైలిని చూసి, కాళిదాస,

అశ్వఘోషులలో ఎవరు ఎవరి వల్ల ప్రభావితం అయ్యారు-- అనే ప్రశ్న ఉదయిస్తుంది.

No comments:

Post a Comment