Saturday, September 8, 2012

హిమాలయ జీవనం

 



హిమాలయ జీవనం 





ఎప్పుడయినా, కోపం వస్తే, 'ఇదిగో, నేను కాశికో, హిమాలయాలకో, వేలిపోతా,జాగ్రత్త!'అని బెదిరిస్తున్టాము కదా, 

ఇది చదివాకా నాకు అంత అదృష్టం అసలు వస్తుందా అనిపించింది. శ్రీ స్వామి రామ గారి ' హిమాలయ పరమ


గురువులతో జీవనం' పుస్తకం చదువుతున్నాను. ఈయన హిమాలయాల్లో పుట్టి పెరిగారు. ఇక్కడి అందమయిన 

ప్రకృతి, ప్రజల స్వచ్చత, నాకెంతో నచ్చింది. సంక్షిప్తంగా, మీరూ చదవండి.

హిమాలయ (హిమ- మంచు, ఆలయం- స్వగృహం) అనే పేరు సంస్కృతం నుంచి వచ్చింది. ఈ సాటి లేని ప్రాచీన 

పర్వతాలు, విందామన్న కుతూహలం ఉన్న వాళ్లకి తమ ఆధ్యాత్మిక వైభవాన్ని రహస్యంగా వినిపిస్తుంటాయి. 

హిమాలయాలు నా ఆధ్యాత్మిక తల్లిదండ్రులు. భయరహితుడనై, గుహలు, సెలయేరులు, పర్వత దారులు, 

ఎత్తయిన శిఖరాలు, నిషేధించిన ప్రాంతాలు, అన్నిటా ప్రయాణించాను. ఇక్కడి జ్ఞానులు, సాధువుల వద్ద నేను

నేర్చుకున్న అమూల్య విషయం, ప్రకృతి పట్ల ప్రేమ, ప్రాణుల పట్ల ప్రేమ, అందరి పట్ల ప్రేమ. వారి సిద్ధాంతం- ప్రకృతి 

పట్ల అవగాహన. ఆత్మను చలిమ్పజేసే, హిమాలయాలలోని వికసించే పుష్పాల నుంచి వచ్చే సంగీతాన్ని, పక్షుల 

సంగీతాన్ని,గంగానది సవ్వడిని, ఎండుటాకుల గల గలల్ని, మానస సరోవరం లోని నీటి స్వచ్చతని, మంచుతో 

కప్పబడ్డ పూల పాన్పులని, లిల్లిలు, ఆర్కిడ్లు , పెద్ద మంచు గడ్డలు,జలపాతాల మంచు ప్రవాహాలు, అన్నిటిలో నా 

ఆత్మ ఐక్యమై, లయమై కదిలింది. మంచు కొండలు ఉదయం వెండిలా, మధ్యానం బంగారంలా, సాయంత్రం ఎర్రగా, 

రంగులు మార్చుకుంటూ,ఉంటాయి. ఉదయం ప్రశాంతంగా, అన్వేషకుల్ని మౌనం లోకి వెళ్లేటట్టు చేస్తుంది. 

సాయంత్రం లక్షలాది రంగుల్ని అసమాన చిత్రకారుడయిన దేవుడు, హిమ శిఖరాలపై వేదజల్లినట్టు ఉంటుంది. 

రాత్రి వేళల్లో వికసించే కొండ జాతి ముళ్ళ మొక్కలు, హిం కమల్ పరిమళాలు, వెన్నెల్లో వెండిలా మెరిసే సెలయేటి 

గట్లు, హృదయ భాష తో తప్ప ఆ సౌందర్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. మనసుకు ప్రకృతిని ప్రేమించడంలో 

శిక్షణ తప్పక ఇవ్వాలి. ఎప్పుడయితే వ్యక్తి ప్రకృతి నిరాడంబరత లోని లోతుల్ని పూర్తిగా గ్రహించి ఆనందించడం 

నేర్చుకుంటాడో, అప్పుడు ఆత్మ యొక్క తేజం బహిర్గతమయ్, అన్నీ అవరోధాలు తొలగిపోతాయి. ప్రకృతి మాత 

స్వయంగా జాగ్రుతులవ్వడానికి తోడ్పడుతుంది. నిశ్శబ్దపు అంతరంగం లోని ప్రేమ సుమం వికసిస్తుంది.

ప్రకృతి చాలా ప్రశాంతమయినది. తమను తాము కలత పెట్టుకునే వాళ్ళని, ఆమె కలవరపెడుతుంది. తన 

సౌందర్యాన్ని ఆరాధించి, అభినందించేవారికి, ఆమె వివేకాన్ని బోధిస్తుంది. బౌద్ధ సంస్కృతి హిమాలయాల్లో పుట్టి, 

టిబెట్, చైనా, జపాన్ లో ప్రవేశించి, వారందరినీ సుసంపన్నం చేసింది. ఇక్కడి 'హంస' సమాజం వారు 

శాఖాహారులు. పాలు- నీరు ఎలా హంస విడదీస్తుందో, వీరికి మంచిని ఎంచుకుని, చెడును వదిలేసే తెలివి ఉంది. 

ఆధునికుల దృష్టిలో, ఇక్కడి గ్రామాలు విద్య, సాంకేతిక, వైద్య రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. ప్రకృతిని 

నాగరీకరించి, ప్రకృతి స్పర్సకి, వాస్తవానికి, దూరమవడం వీరు ఇష్టపడరు. బార్లీ, గోధుమ, పశు సంపద, వీరి

జీవనాధారాలు. వీరికి దురాశ, భౌతిక సంపదలపై పిచ్చి లేదు. ఇక్కడి ప్రజలు, 'దోపిడీ లేకుండా మమ్మల్ని 

వదిలెయ్యండి, దూరం నుండే మా పై గౌరవం, కృతజ్ఞత చూపండి', అంటూ, నిజాయితీగా ఉండడానికి 

ఇష్టపడతారు. ఎవరయినా కనిపిస్తే, వారు అడిగే ప్రశ్న, 'మీరు భోజనం చేసారా? ఉండడానికి చోటుందా?',అని. 

ఎంతటి పెదలయినా పెద్ద మనసుతో, సుఖ సంతోషాలతో ఉంటారు. ఆధునికులు కృత్రిమ ముత్యాలయితే, వీరిది

నిజమయిన మేలి ముత్యాల స్వచ్చత, మెరుపు. ఇక్కడి జీవనం ప్రశాంత మానస సరోవరమాధుర్యం .

No comments:

Post a Comment