Sunday, February 24, 2013

'పరోపకారార్ధమిదం శరీరం'

భగవాన్ సత్యసాయి దివ్య వచన మధురి...సనాతన సారధి నుంచీ.

'పరోపకారార్ధమిదం శరీరం'

మంచీ చెడ్డలు ఒకే చోట పుడుతుంటాయి. ఒకే కొలనులో తామర పువ్వూ పెరుగుతుంది, రక్తాన్ని పీల్చే జలగ కూడా పెరుగుతుంది. కొందరు మంచిని స్వీకరించి చెడును విడిస్తే, మరికొందరు, చెడును తీసుకుని మంచిని విడిచిపెడతారు. 

మంచివారు మంచి గంధపు చెట్టువంటివారు. తన కొమ్మను నారికే గోద్దలికి కూడా పరిమళాన్ని అందిస్తుంది గంధపు చెట్టు. అగరువత్తి తనను కాల్చినా, సుగందాన్నే వెదజల్లుతూ ఉంటుంది. చెట్టు తన కొమ్మలు నరికినవానికి కూడా చాయను అందిస్తుంది. నది తన నాధుడయిన సముద్రుడిని చేరడానికి రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపలు దాటుకుంటూ, యెంత శ్రమకయినా వార్చి, దారిలో జీవుల దాహం తీరుస్తూ, పంటలు పండిస్తూ, సాగిపోతూనే ఉంటుంది. గోవులు తమ రక్తాన్ని పాలుగా మార్చి, బిడ్డలా నోళ్ళు కట్టి, మనకు క్షీరం అనే అమృతాన్ని ఇస్తున్నాయి. 

మన దేహం ఈ గంధపు వత్తి మాదిరి కాలుతూ కాలుతూ, ప్రపంచానికి మంచిని అందించాలి. ఈ చెట్లు, నదులు, గోవులు అన్నిటి కంటే మనిషి ఎక్కువ ఉపకారి కావాలి. లేక మనిషి పేరు పెట్టుకున్న మనం పశు సమానులం అవుతాము. 


No comments:

Post a Comment