Sunday, February 24, 2013

పత్నీవ్రత ధర్మాలు

సమాజంలోని దురాచారాలను  తన వ్యంగ్య రచనలతో ఖండించిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి 'సత్యరాజా పూర్వదేశ యాత్రలు' నవలలో వివరించిన పత్నీవ్రత ధర్మాలు...ఈ నవలలో సత్యరాజు కొన్ని పరిస్థితుల్లో స్త్రీ స్వామ్య వ్యవస్తలో నడిచే ఆడమళయాళానికి చేరుకుంటాడు. అక్కడ అతడిని నిర్బంధించి, అక్కడి ఆచార  వ్యవహారాలు అన్నీ నేర్పిస్తారు .

రోజూ పురుషుడు పొద్దుటే నిద్ర లేచి, నదిలో మునిగి కలశంలో నది నీళ్ళు తెచ్చి, పత్ని కాళ్ళు కడిగి , ఆ పాద తీర్ధం సేవించాలట...

ప్రతి దినంబును బురుషుండు పత్ని కంటె 
ముందుగా లేచి నదిలోన మునిగి జలము 
కలశమున దెచ్చి నిజపత్ని కాళ్ళు కడిగి 
తానూ శ్రీ పాద తీర్థంబు త్రాగావలయు ||

కుష్టు రోగిణి అయినా, గుడ్డిదయినా, వికలాంగురాలయినా , ముసలిదయినా, ఆ పత్ని ఎంగిలి తిన్న పురుషుడు మాత్రమె పుణ్యలోకాలకు వెల్తాడట.

భార్యలు భర్తలను దండిస్తూ అదుపు ఆజ్ఞలలో పెట్టుకొవాలట . లేకపోతే  భర్తలు గాడిదలై చేడిపోతారట .

పురుషుండు గార్ధభమున్ 
స్థిరముగా దండనము లేక చెడిపోదురిలన్ 
గరుణ దలంపక నెలకొక 
పరియయినా గొట్టవలయాన్ని బత్ని పురుషునిన్ || 

వినడానికి మనకు ఇవన్నీ చాలా హాస్యంగా అనిపించినా , ఇవన్నీ  ఆ నాడు స్త్రీకి విధించారని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆడ - మగ ఇద్దరిలో మగవాళ్ళు ఇప్పటికీ మన సమాజంలో కాస్త ఎక్కువ సమానమే!


No comments:

Post a Comment